రామ్‌ చరణ్‌-శంకర్‌ సినిమాకు ‘లైకా’ బ్రేక్.. ‌ | Lyca Production Send Court Notice To Shankar Over India 2 Movie | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌-శంకర్‌ సినిమాకు ‘లైకా’ బ్రేక్..

Apr 1 2021 1:36 PM | Updated on Apr 1 2021 4:18 PM

Lyca Production Send Court Notice To Shankar Over India 2 Movie - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.  దిల్‌ రాజు నిర్మాణంలో చెర్రీ ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడటం చకచకా అయిపోయాయి. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ ఇప్పట్లో సెట్స్‌పై వచ్చేల కనిపించడం లేదు. కాగా శంకర్‌ ఇప్పటికే కమల్‌ హాసన్‌తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

25 ఏళ్ల క్రితం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన భారతీయుడు సీక్వెల్‌గా శంకర్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్‌ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. ఆ షాక్‌లో ఉండిపోయిన డైరెక్టర్‌ మళ్లీ ఈ మూవీ రీ-షెడ్యూల్‌కు ప్లాన్‌ చేయడం లేదు. ఇందులో కథానాయికగా చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌ సైతం ఈ మూవీ నుంచి తనకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇక ‘ఇండియా 2’ షూటింగ్‌ కొనసాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ తరుణంలో ‘ఇండియా 2’ను పక్కన పెట్టి శంకర్‌‌ చరణ్‌ మూవీ ప్లాన్‌ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్‌కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. యాక్సిడెంట్‌ తర్వాత శంకర్‌ ‘ఇండియా 2’ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడం, హీరో కమల్‌ హాసన్‌ ఏమో రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఇదంత చూస్తుంటే శంకర్‌ ఇబ్బందుల్లో పడేసేలా ఉంది. 

చదవండి: 
మహేశ్ బాబు‌ నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌
శంకర్‌-రామ్‌ చరణ్‌ కాంబో; ఊహించని స్క్రిప్ట్‌‌

 

Advertisement
 
Advertisement
Advertisement