శంకర్‌-రామ్‌ చరణ్‌ కాంబో; ఊహించని స్క్రిప్ట్

Shankar Make A Strong Script For Ram Charan For Next Movie - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఇండియన్‌ జెమ్స్‌ కెమరూన్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువరిన సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ మూవీ అప్‌డేట్స్‌‌ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చుస్తు‍న్నారు. ఈ క్రమంలో  ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నటించే హీరోయిన్‌ నుంచి సినిమా కాన్సెప్ట్‌ వరకు రకరకాల వార్తలు పుట్టుకొతున్నాయి.

ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శంకర్‌ చెర్రి కోసం ఓ పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ స్క్రీప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ నిజాయితీ గల ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ చూట్టు తిరిగే పొలిటికల్‌ జానర్‌గా రూపొందనున్నట్లు సమాచారం. అయితే శంకర్‌ సినిమాలంటే కథ, కంటెంట్‌, హీరోతో పాటు హీరోయిన్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతేగాక ఆయన సినిమాల్లో హీరోయిన్‌ను‌ ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేస్తారు. దీంతో చెర్రి సరసన నటించే ఆ హీరోయిన్‌ ఎవరా అని చర్చించుకుంటున్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top