‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ | Love OTP Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Love OTP Review: ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ

Nov 15 2025 11:52 AM | Updated on Nov 15 2025 12:25 PM

Love OTP Movie Review And Rating In Telugu

కన్నడ నటీనటులు అనీష్, జాన్విక, ఆరోహి నారాయణ్ మెయిన్ లీడ్స్ లో మన రాజీవ్ కనకాల, ప్రమోదిని.. పలువురు ముఖ్యపాత్రల్లో కన్నడ - తెలుగు బైలింగ్వల్ లో తెరకెక్కిన సినిమా ‘లవ్ ఓటీపీ’. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ ఎం రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ, తెలుగు భాషల్లో ఈ లవ్ ఓటీపీ సినిమా నవంబర్ 14న రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ(Love OTP Review)లో చూద్దాం.

కథేంటంటే.. 
కాలేజీలో క్రికెటర్ అవ్వాలి అనే గోల్ తో ఉన్న స్టూడెంట్ అక్షయ్(అనీష్)ని చూసి సన(ఆరోహి నారాయణ్) ప్రేమలో పడుతుంది. అనీష్ తో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అక్షయ్ తండ్రి(రాజీవ్ కనకాల) పోలీసాఫీసర్. అతనికి లవ్ అంటే అస్సలు పడదు. దీంతో అక్షయ్ లవ్ చేయడానికి భయపడతాడు. కానీ సన మొదట ఫ్రెండ్షిప్ అని అక్షయ్ లైఫ్ లోకి వచ్చి దగ్గరయి ప్రపోజ్ చేస్తుంది. ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తోంది. దీంతో అక్షయ్ సనని లవ్ చేయాల్సి వస్తుంది. 

ఇష్టం లేకపోయినా సన ఎక్కడ చనిపోతుందో అని ఆమె టార్చర్ భరిస్తూ ఉంటాడు అక్షయ్. ఓ సారి క్రికెట్ లో తనకు దెబ్బ తగిలినప్ప్పుడు ఫిజియోథెరఫిస్ట్ నక్షత్ర(జాన్విక)పరిచయం అవుతుంది. నక్షత్రతో ప్రేమలో పడతాడు అక్షయ్. సనతో లవ్ స్టోరీ ఆమెకు చెప్పడంతో నక్షత్ర అర్ధం చేసుకొని ఆమె కూడా అక్షయ్ ని ప్రేమిస్తుంది. మరి నక్షత్ర - అక్షయ్ ప్రేమ సనకు తెలుస్తుందా? అక్షయ్ తండ్రికి తెలుస్తుందా? సన ఏం చేసింది? అసలు సనతో అక్షయ్ పడ్డ ఇబ్బందులు ఏంటి? చివరకు అక్షయ్ ఎవరితో ఉంటాడు? లైఫ్ లో క్రికెటర్ అవుతాడా తెలియాలంటే లవ్ OTP సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
గర్ల్ ఫ్రెండ్ టార్చర్ చేయడం అనేది వల్లభ లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో అది చాలా కామెడీగా చూపించారు. తండ్రి అంటే భయం ఉన్న ఓ అబ్బాయి అనుకోకుండా ఓ అమ్మాయిని లవ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అని సిట్యువేషనల్ కామెడీతో చూపించారు. 

ఫస్ట్ హాఫ్ అంతా సన - అక్షయ్ లవ్ స్టోరీతో నవ్వించి ఇంటర్వెల్ కు ముందు నక్షత్రతో ప్రేమాయణం, ఆమె గురించి సనకు తెలియడంతో ఏం చేస్తుంది అని సెకండ్ హాఫ్ కి తగ్గ బ్యాంగ్ ఇచ్చారు. అయితే ఫస్ హాఫ్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ ఎమోషనల్ సైడ్ కి మార్చేశారు. సెకండ్ హాఫ్ లో అక్షయ్ ఇద్దరి మధ్య నలిగిపోవడం, సన ఏమో అక్షయ్ కావలనడం.. ఇలా ముక్కోణపు ప్రేమకథగా ఎమోషనల్ గా సాగుతుంది. 

ఫాదర్ ఎమోషన్ కూడా సెకండ్ హాఫె లో బాగానే వర్కౌట్ చేసారు. కానీ సెకండ్ హాఫె కొంచెం సాగదీశారు. కథ అయిపోయింది హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది అనుకునేలోపు ఇంకా సాగదీసి మళ్ళీ బాధాకరమైన ముగింపు ఇచ్చారు. మరి అలా ఎందుకు ముగించారో దర్శకుడికే తెలియాలి. టైటిల్ లవ్ ఓటీపీలో ఓటీపీ అంటే ఓవర్ – టార్చర్ – ప్రెజర్ అని పెట్టి టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా చూసారు. ఈ సినిమా కన్నడలో తెరకెక్కించి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఈ క్రమంలో చాలా డైలాగ్స్ కన్నడలోనే ఉంటాయి. కథ కూడా అంతా బెంగుళూరులోనే జరుగుతుంది. దీంతో ఒకానొక సమయంలో కన్నడ సినిమా చుస్తున్నామా అనే ఫీలింగ్ రావడం ఖాయం. ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా సరదాగా చూడొచ్చు.    

ఎవరెలా చేశారంటే..
అనీష్ ఓ పక్క దర్శకుడిగా సినిమాని తెరకెక్కిస్తూ నటనలో కూడా బాగా మేనేజ్ చేసాడు. టార్చర్ పెట్టె గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఆరోహి నారాయణ్ హైపర్ యాక్టివ్ గా నటించి నవ్వించింది. చివర్లో ఎమోషనల్ కూడా మెప్పించింది. మరో హీరోయిన్ జాన్విక కూడా క్యూట్ గా అలరిస్తూనే ఎమోషనల్ గా పర్వాలేదనిపించింది. రాజీవ్ కనకాలకు మంచి కామెడీ పాత్ర పడింది. చివర్లో నాన్న ఎమోషన్ కూడా బాగానే పండించారు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నాట్యరంగా నవ్విస్తాడు. ప్రమోదిని.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బెంగుళూరులో చాలా వరకు రియల్ లొకేషన్స్ లో న్యాచురల్ గా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలు యావరేజ్. సెకండ్ హాఫ్ లో కొంత ఎడిటింగ్ చేసి సాగదీత తగ్గిస్తే బాగుండేది. గర్ల్ ఫ్రెండ్ పెట్టె టార్చర్ అనే పాయింట్ తీసుకొని ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిన అబ్బాయి పాత్రలో కామెడీగా ఎమోషనల్ గా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
-రేటింగ్‌: 2.75/5
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement