
లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమా ట్రైలర్ బుధవారం విడుదలయ్యింది. జయంతి గాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మై ఇంక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యువతను ఆకర్షించేలా ఉంది. చాలా తెలుగు సినిమాలు ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించుకుంటూ చివరకు మంచి ముగింపుతో శుభం కార్డు వేస్తాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
చాలా సరదాగా మొదలైన కథ చివరకు అనేక మార్పులు జరిగి హీరో, హీరోయిన్ తమని తాము అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. పెళ్లంటే పెద్దగా నమ్మకం లేని అమ్మాయి అబ్బాయి కలుస్తారు. ఒకరికి ఒకరు దగ్గరయిన తరువాత హీరో పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అయితే పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే ఇప్పటి జనరేషన్‌కు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాగే పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటారని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది. కార్తీక్, సంచిత ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్