'లోపలికి రా చెప్తా' ట్రైలర్ రిలీజ్ | Lopaliki Ra Chepta Movie Trailer | Sakshi
Sakshi News home page

'లోపలికి రా చెప్తా' ట్రైలర్ రిలీజ్

Jun 22 2025 7:34 PM | Updated on Jun 22 2025 7:34 PM

Lopaliki Ra Chepta Movie Trailer

కొండా వెంకట రాజేంద్ర, మనీషా, సుస్మిత, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లోపలికి రా చెప్తా'. లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హారర్ కామెడీ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?)

జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ఈ సినిమా రాబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది. రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.  ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ‘లోపలికి రా చెప్తా’ సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని నా బెస్ట్ విషెస్ అని చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్)

Advertisement
 
Advertisement
Advertisement