'లోపలికి రా చెప్తా' టైటిల్‌ ఎందుకు పెట్టానంటే: దర్శకుడు | Lopaliki Ra Chepta Movie Director Interview | Sakshi
Sakshi News home page

'లోపలికి రా చెప్తా' టైటిల్‌ ఎందుకు పెట్టానంటే: దర్శకుడు

May 7 2025 7:46 PM | Updated on May 8 2025 8:53 AM

Lopaliki Ra Chepta Movie Director Interview

కొండా వెంకటరాజేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న హారర్‌ కామెడీ డ్రామా 'లోపలికి రా చెప్తా'. మనీషా జష్మాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్‌ హీరోయిన్లు. లక్ష్మీ గణేశ్‌, వెంకట రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ మీడియాతో మాట్లాడారు. పలు విశేషాలు పంచుకున్నారు. 

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక

'లోపలికి రా చెప్తా ‍అనే పదం గురించి మీకు వివరిస్తా. మీ అబ్బాయి బయట అల్లరి చేస్తున్నాడు అనుకోండి. అక్కడ చుట్టాలు ఉన్నారు. మీరు ఏం చేస్తారు... లోపలికి రా నీ సంగతి చెప్తా అంటారు. పిల్లలు అల్లరి చేస్తుంటే హెడ్ మాస్టర్ కూడా ఇదే పదం ఉపయోగిస్తాడు. సో లోపలికి రా చెప్తా అనే పదంలో వేరే ఉద్దేశం లేదు. మీరు తప్పుగా ‍అర్థం చేసుకుంటున్నారు' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?

ఇక ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యలు కూడా రాజేంద్రనే తీసుకున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ..‘సినిమా నిర్మాణంలో హీరో, డైరెక్టర్‌, నిర్మాత..ఈ ముగ్గురు చాలా కీలకం. సినిమా తీయాలన్న, ఆగాలన్నా ఈ ముగ్గురి చేతుల్లోనే ఉంటుంది. ఈ ముగ్గురి ఈగోల వల్ల చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయినా సందర్భాలు ఉన్నాయి. నా సినిమాకు అలాంటి సమస్యలు రావొద్దని నేనే ఆ బాధ్యతలు తీసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా తీయాలకున్నప్పడు నాకు ఏ ప్రొడ్యూసర్‌ దొరకలేదు. యూఎస్‌లో గణేష్‌ అనే స్నేహితుడు సపోర్ట్‌ చేశాడు. నేను నిర్మాత అని పేరు మాత్రమే వేసుకున్నాను కానీ గణేషే ఆ బాధ్యతలు ఎక్కువగా చూసుకున్నాడు’ అని అన్నారు. 

చిరిగిపోయిన చెక్‌ ఇన్సిడెంట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నన్ను డైరెక్టర్‌గా నమ్మి ఒక నిర్మాత రూ.60 వేల చెక్‌ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మా అమ్మకు ఫోన్‌ చేసి నేను డైరెక్టర్‌ అయ్యాయని చెప్పా. ఆ ఎక్సైట్మెంట్‌తో బ్యాంక్‌కి వెళఙ్ల చెక్‌ పాకెట్‌ నుంచి బయటకు తీస్తుంటే..చిరిగిపోయింది. బ్యాంక్‌ వాళ్లు అది యాక్సెప్ట్‌ చేయలేదు. ఈ విషయం నిర్మాతకు చెబితే.. ‘చెక్‌నే హ్యాండిల్‌ చేయలేదు ఇంత పెద్ద సినిమాని ఎలా హ్యాండిల్‌ చేస్తావ్‌ అన్నారు. నాకు చాలా బాదేసింది.వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయా. ఇక నన్ను ఎవ్వడు నమ్మడు..నాకు నేనే దిక్కని ఆరోజే ఫిక్సయ్యాను’అని చెపుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement