వనితపై వరుస కేసులు | Lockdown Rules Break Case File Against Vanitha Vijaykumar | Sakshi
Sakshi News home page

వనితపై వరుస కేసులు

Jul 30 2020 8:24 AM | Updated on Jul 30 2020 9:42 AM

Lockdown Rules Break Case File Against Vanitha Vijaykumar - Sakshi

పెరంబూరు: నటి వనిత విజయకుమార్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. వివాదాల నటిగా ముద్ర వేసుకున్న ఈమె ఎక్కడ ఉంటే అక్కడ చర్చే అనే పరిస్థితి నెలకొంది. ఆ మధ్య బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొని వివాదాలకు నిలయంగా మారారు. పీటర్‌పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని మరోసారి చర్చకు తెరలేపారు. ఈమె మూడో పెళ్లి చేసుకోవడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. అందులో లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ, నిర్మాత రవీందర్, సూర్యదేవి ప్రధానంగా ఉన్నారు. కాగా వనితా, సూర్యదేవి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకు న్నారు. (కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు)

తనను, తన భర్తను విమర్శించిందంటూ దర్శకురాలు లక్ష్మీరామకృష్టన్, వనితకు న్యాయవాది ద్వారా సమన్లు పంపింది. కరోనా కాలంలో అనుమతి లేకుండా వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించిందంటూ వనితపై స్థానిక  అయ్యప్పన్‌ తంగల్‌కు చెందిన అపార్ట్‌మెంట్ల సంఘం కార్యదర్శి నిషా తోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన వనిత వాటన్నింటిని చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. మంగళవారం ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమానికి జడ్జిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు నెలల తరువాత ముఖానికి మేకప్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నానని అన్నారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడే వారు అలాగే  ఉంటారని వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోకూడదని వనిత వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement