Dhoni Entertainment LGM Official Telugu Trailer Released on Today - Sakshi
Sakshi News home page

LGM Trailer Telugu: కాబోయే అత్త-కోడలు కలిసి ట్రిప్‌కి వెళ్తే?

Jul 18 2023 8:27 PM | Updated on Jul 18 2023 8:43 PM

LGM Trailer Telugu Dhoni Producer Movie - Sakshi

మారుతున్న ట్రెండ్‌లో ప్రేమ‌కు అర్థం మారిపోయింది. అమ్మాయి-అబ్బాయి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉండి, న‌చ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాష‌న్ అని అనుకోవ‌చ్చు. కానీ అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవ‌టానికే ఇది కచ్చితమనే భావ‌న ఉండటంతో చాలామంది అటు వైపుగానే ఆలోచ‌న‌లు చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్)

అలానే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడ‌లిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి త‌న ప్రేమికుడిని విచిత్ర‌మైన కోరిక కోరుతుంది. త‌న‌కు కాబోయే అత్త‌తో క‌లిసి కొన్ని రోజులు ట్రిప్‌ వెళ‌తాన‌ని అప్పుడు ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఒక‌రికీ తెలుస్తుంద‌ని చెబుతుంది. ఇది కాస్త వింతగానే ఉన్నా.. అతడు ఒప్పుకొంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే 'ఎల్‌జీఎం' చూడాల్సిందే. 

టీమిండియా స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తీసిన ఫస్ట్ మూవీ ఇది. తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీస‍్తున్న ఈ చిత్రానికి ర‌మేష్ త‌మిళమ‌ణి ద‌ర్శ‌కత‍్వంతో పాటు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

(ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement