లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో.. | Laya Shares Daughter Sloka Birthday Celebration Photos | Sakshi
Sakshi News home page

Laya: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. కూతురికి లయ బర్త్‌డే విషెస్‌

Jun 26 2025 11:31 AM | Updated on Jun 26 2025 1:50 PM

Laya Shares Daughter Sloka Birthday Celebration Photos

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా రాణించింది లయ (Actress Laya Gorty). శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా.. ఇలా బోలెడు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేండ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికాలో సెటిలైన లయ తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.

తమ్ముడుతో రీఎంట్రీ
నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమాలో లయ అక్కగా నటించింది. వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు లయ సినిమాలకు దూరంగా ఉందే కుటుంబం కోసం! అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయింది. తాజాగా లయ ఇంట గ్రాండ్‌ ఫంక్షన్‌ జరిగింది. 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా శ్లోక..
ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే మై శ్లోక ప్రిన్సెస్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్‌ సన్‌షైన్‌కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. శ్లోక.. అమర్‌ అక్బర్‌ ఆంటోని మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. అఖండ 2లోనూ శ్లోక భాగమైనట్లు ఆమధ్య ఓ రూమర్‌ తెగ వైరలయింది.

 

 

చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement