'రాజ్‌ తరుణ్ ఫోన్ నుంచే కాల్‌ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్! | Lavanya Shocking Comments On Raj Tarun Relation With Ariyana Glory | Sakshi
Sakshi News home page

Raj Tarun- Lavanya: రాజ్‌తరుణ్‌కు అరియానాతో ఎఫైర్.. అప్పుడే నాకు తెలిసింది: లావణ్య

Jul 12 2024 1:35 PM | Updated on Jul 12 2024 1:49 PM

Lavanya Shocking Comments On Raj Tarun Relation With Ariyana Glory

ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్‌ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌కు రిలేషన్‌ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్‌ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్‌కు ఎఫైర్‌ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.

లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్‌ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్‌గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement