
‘బాహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్
బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర ఓ మేజర్ హైలైట్. ఈ పాత్రనే ప్రధాన కథాంశంగా‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ కథను రెడీ చేస్తున్నారట. ఈ కథతో ఓ సినిమా తీసేందుకే ఆయన కట్టప్ప పాత్ర ఆధారంగా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మాహిష్మతి రాజ్యంలో కట్టప్ప ఎందుకు కట్టుబానిసలా ఉన్నాడు? కట్టప్ప గతం, కట్టప్ప పూర్వీకుల నేపథ్యం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయట.
మరి... ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను పోషించిన సత్యరాజ్ ‘కట్టప్ప’ సినిమాలోనూ హీరోగా నటిస్తారా? లేక మరొకరు నటిస్తారా? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే అంశాలపై స్పష్టత రావడానికి కొంత టైమ్ పడుతుంది. ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించింది. అలాగే ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’గా ఈ అక్టోబరు 31న విడుదల చేయనున్నారు.