‘‘నేను రాజైన తర్వాత నువ్వే నా సేనాధిపతివి’’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ట్రైలర్. ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి: ది కన్‌క్లూజన్ (2017) విడుదలైంది.
బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ టైటిల్‌తో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో భళ్లాల దేవుడికి మహారాజా పట్టాభిషేకం’, ‘మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి... అదే నా కోరిక’, ‘దేవసేన నీది... నేను మాటిస్తున్నాను...’, ‘నేను నీవాణ్ణి దేవసేన...’, ‘మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు...’, ‘ఏది మరణం... మన గుండె ధైర్యంకన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం... ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను...’, ‘బాహుబలి తిరిగొచ్చాడు’ అనే డైలాగ్స్ ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.


