'బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్' | Rajamouli, Prabhas, Rana Reunite for Baahubali: The Epic Re-Release on Oct 31 | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ' కట్టప్ప ఆ పనికి సిద్ధం కావడమే.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్'

Oct 27 2025 3:55 PM | Updated on Oct 27 2025 4:06 PM

SS Rajamouli about his latest Movie bahubali the epic

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకేసారి వీక్షించేలా బాహుబలి ది ఎపిక్(Baahubali : The Epic) పేరుతో రానున్నారు. ఈ మూవీని ‍‍అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్, రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్‌ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఈ లేటేస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి? అని రాజమౌళిని ప్రభాస్‌ అడిగారు. దీనికి బదులిస్తూ.. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. ‍అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్‌ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement