దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మహిస్మతి సామ్రాజ్యం మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే బాహుబలి ది ఎపిక్ పేరుతో మీ ముందుకొచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలై ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరో బాహుహలి చిత్రం ముందుకొస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు.
ఈ బాహుబలి యానిమేషన్ మూవీతో ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందించనున్నారు మేకర్స్. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్-1 పేరుతో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. యానిమేషన్ సీన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రముఖ అవార్డ్ గ్రహీత, డైరెక్టర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా ఉన్నారు.
Amarendra Baahubali’s death wasn’t his End…it was the beginning of something Eternal. 🔥#BaahubaliTheEternalWar Teaser out now!
Telugu: https://t.co/sj4FkCLo5s
Hindi: https://t.co/waTg71bKIe
Tamil: https://t.co/6YYjTrc4RD#Baahubali @ssrajamouli #Prabhas @meramyakrishnan… pic.twitter.com/qDdERcMX7e— Baahubali (@BaahubaliMovie) November 4, 2025


