‘‘ఇంతకు ముందు పెళ్లి వ్యవహారాన్ని హీరోయిన్లు రహస్యంగా మార్చేశారు. ఇప్పుడు కాలం మారింది. యువతరం కొత్తగా ఆలొచిస్తున్నారు. వారితో పాటు మనం మారుతున్న పరిస్థితి. మా పెద్ద అమ్మాయి అవంతికకు పెళ్లి జరగబోతోంది. ఆమె హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి రెండు చిత్రాల్లో నటించారు. మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. ఇక మా రెండో కూతురు ఆనందిత కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆమె నిర్వహణ బాధ్యతలను నిర్వహించిన తొలి చిత్రం డబుల్ ఆక్యుపెంసీ. గత 12 వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ఈ చిత్ర విజయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కెమెరా ముందు, వెనుక పని చేసిన టీమ్ కే చెందుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో చిత్రం చేయడానికి థియేటర్ లకు కుటుంబసమేతంగా వచ్చే ప్రేక్షకులకు పైసా వసూల్ అని చెప్పుకుంటూ జాలీగా బయటకు వెళ్లాలనే నేను, సుందర్ సి మా పిల్లలకు చెబుతాం.
అదే విధంగా ఇక్కడ మీకంటే ఎవరు ఎక్కువ కాదు. ప్రతిభను చాటుతూ శ్రమిస్తే విజయం తధ్యం అని చెపుతాం. ఆ విధంగా చిత్ర నిర్మాణ రంగంలో మా రెండవ కూతురు ఆనందిత మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర యూనిట్ కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడిస్తాం’’ అని డబుల్ ఆక్యుపెంసీ చిత్ర సక్సెస్ మీట్ లో నటి, నిర్మాత కుష్బూ సుందర్ పేర్కొన్నారు.
వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అవ్వీ మూవీస్, బెంచ్ మీడియా సంస్థలు కలిసి నిర్మించారు. అశ్విన్ కందస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్, సంయుక్త విశ్వనాధన్, రేష్మా వెంకటేష్, వినోద్ కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.


