
కోలీవుడ్ స్టార్ ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న కుబేర కలెక్షన్ల పరంగా వందకోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్ర పోషించారు.
తాజాగా ఈ చిత్రంలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. అనఅనగా కథ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కరీముల్లా, హైడ్ కార్తి ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.
కుబేర కథేంటంటే..
'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.