'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా | Actor Dhanush And Akkineni Nagarjuna Kuberaa Movie Making Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Kubera Making Video: బిచ్చగాడి పాత్ర కోసం ధనుష్ ఇలా కష్టపడ్డాడా?

Jun 21 2025 10:01 AM | Updated on Jun 21 2025 5:44 PM

Kubera Movie Making Video

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' థియేటర్లలోకి వచ్చేసింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చాలారోజుల తర్వాత థియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయి. ధనుష్ నటనని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ఎంత కష్టపడ్డారనే మేకింగ్ వీడియోని టీమ్ రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

ఈ వీడియోలో అసలు రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ ఎలా చేశారనేది చూపించారు. అలానే సినిమాలో కొన్నిసీన్లు చెత్తకుప్పలో చిత్రీకరించారు. కొన్నిసార్లు నిజమైన డంప్ యార్డ్‌లో తీసినప్పటికీ మరికొన్ని సార్లు కృత్రిమంగా అలాంటి ప్రదేశాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. మేకింగ్ వీడియోలోనూ ఈ  బిట్ చూపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలో బడా వ్యాపారులు వేల కోట్ల సంపదతో ఎలాంటి మోసాలు చేస్తున్నారనే విషయాల్ని చూపించారు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా.. నాగార్జున సీబీఐ అధికారిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. ఫస్టాప్‌లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర కాగా.. సెకండాఫ్‌లో హీరోకి సాయపడే వ్యక్తిగా కనిపించారు. చాలారోజుల తర్వాత నాగ్ ఫెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. రష్మిక ఎప్పటిలానే తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వీకెండ్ పూర్తయితే ఈ మూవీ రిజల్ట్‌పై ఫుల్ క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement