రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్; థియేటర్లలో క్రాక్‌ | Krack Movie: All Problems Solved | Sakshi
Sakshi News home page

క్రాక్‌: థియేటర్లలో ఆట మొదలైంది..

Jan 9 2021 7:50 PM | Updated on Jan 9 2021 8:33 PM

Krack Movie: All Problems Solved - Sakshi

పక్కా కమర్షియల్‌ మాస్‌ ఫిల్మ్‌ 'క్రాక్'‌ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమా ఉంటుందో, ఉండదో అన్న అనుమానంలో కొట్టుమిట్టాడుతూ, థియేటర్ల ఎదుటే పడిగాపులు కాస్తున్న అభిమానులకు దర్శకుడు గోపీచంద్‌ మలినేని శుభవార్త చెప్పారు. అన్ని సమస్యలు తొలిగాయని, దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి నేటి సాయంత్రమే ఫస్ట్‌ షో చూసేయండని పిలుపునిచ్చారు. దీంతో మాస్‌ మహారాజ రవితేజ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫలితం దక్కినట్లైంది. కొంచెం లేటయ్యిందేమో కానీ కలెక్షన్ల వర్షం పక్కా అంటూ థియటర్ల ముందు బారులు తీరుతున్నారు.

పొద్దున టికెట్‌ క్యాన్సల్‌ అయినవాళ్లు కూడా ఈ మాస్‌ చిత్రాన్ని చూసేయాల్సిందేనంటూ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు 'లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడు. అన్నా కుమ్మేయ్‌.. కిక్కు వెయిటింగ్‌లోనే ఉంటుంది' అని హీరో మంచు మనోజ్‌ క్రాక్‌ సినిమాకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పాడు. పలువురు దర్శకనిర్మాతలు కూడా కొత్త సంవత్సరంలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రాన్ని చూసేయండని పిలుపునిస్తున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించాడు. (చదవండి: క్రాక్‌’ వాయిదా.. నిర్మాతపై రవితేజ సీరియస్‌!)

Advertisement
 
Advertisement
Advertisement