'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్‌2పై అంచనాలు పెంచేసిన కొరటాల | Koratala Siva Comments On Devara Part 2 | Sakshi
Sakshi News home page

'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్‌2పై అంచనాలు పెంచేసిన కొరటాల

Oct 8 2024 9:24 AM | Updated on Oct 8 2024 11:23 AM

Koratala Siva Comments On Devara Part 2

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్‌ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్‌ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం  ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్‌ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

దేవర పార్ట్‌2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్‌ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్‌లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్‌2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్‌ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్‌1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్‌లో అసలు కథ ఉంది.  100 శాతం చూస్తారు. సీట్‌ ఎడ్జ్‌లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్‌లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది.  అందరికీ మంచి ఫీల్‌ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్‌ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.

దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్‌ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా  జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్రలో నటించారు.  శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement