స్టార్ కమెడియన్ సాహసం.. కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్..! | Kollywood Star Comedian Yogi Babu Breaks Kamal Haasan Record With 11 Characters In Upcoming Film | Sakshi
Sakshi News home page

స్టార్ కమెడియన్ సాహసం.. కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్..!

Jul 5 2026 9:21 AM | Updated on Jul 5 2026 12:30 PM

Kollywood star Comedian yogi babu breaks Kamal Haasan record

గతంలో దివంగత నటుడు శివాజీ గణేషన్‌ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటిస్తే.. కమలహాసన్‌ ఏకంగా దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ రికార్డ్‌ను ప్రముఖ ‍స్టార్ కమెడియన్ యోగిబాబు బ్రేక్ చేయనున్నారు. ఆయన ఏకంగా 11 పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్‌ కిషోర్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌ రాజా శిష్యుడు కాగా.. ఈ చిత్రాన్ని  9 లైట్స్‌ పతాకంపై సురేష్‌ ముత్తు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేస్తుంది. 
ఈ మూవీలో మలయాళ నటి అతిథి రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

యోగి బాబు 11 పాత్రలు నటిస్తున్న కామెడీ యాక్టర్‌ కథా చిత్రంగా  ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో హీరో,విలన్, కమెడియన్‌ పాత్రల్లో యోగిబాబు నటిస్తున్నట్లు చెప్పారు .అదే విధంగా ఇందులో కవల పిల్లల పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. ఒక సైనిక హెలికాప్టర్‌ ప్రమాదానికి గురవుతుందని అందులోని బ్లాక్‌ బాక్స్‌ కనుగొనే ప్రయత్నం అన్నారు. ఈ ప్రమాదానికి కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొని సవాళ్లను వినోదం, యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ షూటింగ్ ఇంగ్లాండ్, కెన్యా దేశాల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రెడిన్‌ కింగ్స్‌ లీ,వీటీవీ గణేశ్, పంజు సుబ్బు, ఏ.వెంకటేశ్ ముఖ్యపాత్రులు పోషిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement