రాఘవ లారెన్స్ ప్రకటన.. మరోసారి తెరపైకి త్రిష..! | Kollywood actress Trisha enters Into Tamilnadu politics | Sakshi
Sakshi News home page

Trisha: రాఘవ లారెన్స్ ప్రకటన.. త్రిష ఎంట్రీ ఖాయమేనా?

Jun 30 2026 7:01 PM | Updated on Jun 30 2026 7:13 PM

Kollywood actress Trisha enters Into Tamilnadu politics

తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అక్కడి ప్రజలు వ్యవస్థ కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారని మొన్న ఎన్నికల్లోనూ స్పష్టమైంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన దళపతి విజయ్ ఏకంగా సీఎం పీఠం ఎక్కేశారు. ఎంతలా ఓ వ్యక్తిని ద్రవిడ ప్రజలు అభిమానిస్తారో ఈ ఫలితాలే నిదర్శనం. ఇక విజయ్ సీఎం అయ్యాక చాలామంది సినీ స్టార్స్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ధనుశ్, రాఘవ లారెన్స్, విశాల్ ఇలా చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇటీవలే ఎంట్రీ ఇస్తారని ఆశించిన రాఘవ లారెన్స్ సైతం తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా వచ్చే అవకాశముందని హింట్ ఇచ్చారు. మరోవైపు లారెన్స్.. విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహగానాలొచ్చాయి. ఇవాల్టి ప్రకటనతో ఆయన ఎంట్రీ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. మరి తిరుచ్చి స్థానంలో ఎవరు నిలబడతారనే విషయంపై మరోసార చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో అందరి చూపులు ఆమెవైపే చూస్తున్నాయి. తాను మరెవరో కాదు.. విజయ్ గెలిచాక ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా మారిన త్రిష. విజయ్ సీఎం అయ్యాక.. త్రిష ఏకంగా హోం మినిస్టర్ కానుందని కథనాలొచ్చాయి. త్రిష బర్త్‌ డే రోజే ఎన్నికల ఫలితాలు రావడంతో మరింత హైలెట్‌గా నిలిచింది. తాజాగా రాఘవ లారెన్స్ తిరుచ్చిలో పోటీ చేయనంటూ ప్రకటించిన నేపథ్యంలోనే మరోసారి త్రిష పేరు వినిపిస్తోంది. ఆమె కోసమే రాఘవ లారెన్స్ పోటీ నుంచి తప్పుకున్నారా? అనే చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement