నేను అలాంటి చిత్రాల్లో నటించలేదు.. కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన | Sakshi
Sakshi News home page

రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్‌ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన

Published Sat, Feb 24 2024 12:08 PM

Kiran Rathod Comments On Her Past Life - Sakshi

హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్‌ రాథోడ్‌. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్‌ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్‌.  ఈమె బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కజిన్‌ కూడా!

తమిళంలో కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్ సహా ప్రముఖ హీరోలతో నటించిన కిరణ్.. సినిమా ఛాన్సులు పీక్‌లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు బిగ్‌బాస్‌-7లో కనిపించిన కిరణ్‌ మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా ఒక యూట్యుబ్‌ ఛానల్‌ కోసం ఆమెను  నటి షకీల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

(ఇదీ చదవండి: వంద కోట్ల స్టార్‌ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?)

చాలా ఏళ్లుగా తనపై వస్తున్న రూమర్స్‌ గురించి కిరణ్‌ ఇలా చెప్పారు. 'నేను ఇప్పటి వరకు ఎలాంటి  అశ్లీల చిత్రాల్లో  నటించ లేదు. కానీ మీడియా నాపై ఎందుకు అలాంటి వార్తలను ప్రచారం చేసిందో తెలియదని కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.' తమిళ్‌లో జెమిని సినిమా తర్వాత ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన కిరణ్‌ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్‌ కొట్టలేకపోయింది. 

వాడి వల్లే సినిమా ఛాన్సులు తగ్గాయి
గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్‌ అయింది. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను నటించాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఏవరైనా ఆఫర్లు ఇస్తే తప్పకుండా మళ్లీ నటిస్తాను. అని చెప్పుకొచ్చింది కిరణ్‌ రాథోడ్‌.

సినిమా ఆఫర్లు ఇచ్చి రాత్రికి ఫోన్‌ చేస్తారు 
ప్రేమించిన వాడు దూరం అయ్యాడు.. చేతిలో సినిమాలు లేవు. అలాంటి సమయంలో కొందరు సినిమా ఛాన్స్‌ ఉందని కాల్‌ చేస్తారు. మీకు మంచి పాత్ర ఉందని కూడా ఆఫర్‌ చేశారు. ఎవరైతే ఆఫర్లు ఇస్తామని చెప్పారో మాట్లాడిన అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్‌ చేస్తారు. తనతో గడపాలంటూ ఫ్లాట్‌కు రమ్మంటారు. అలా ప్రతిరోజూ చాలామంది రాత్రి అయితే కాల్స్‌ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు అర్థం అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరూ స్నేహితులు లేరు.. ఎవరూ సాయం చేయరు. అని తన పాత రోజులను గుర్తు చేసుకుంది.  

యాప్‌లో గ్లామర్‌ ఫోటోలు, వీడియోలు 
సినిమా అవకాశాలు లేకపోవడంతో అదే సమయంలోనే నేనొక యాప్‌ని ప్రారంభించాను. అందులో నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాను. అది చూసి నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తారనుకున్నాను. కానీ వారితో పాటు మరికొందరు డబ్బులిస్తామంటూ కమిట్‌మెంట్‌ అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒకరి పేరు చెప్పనవసరం లేదు.. ఆ సమయంలో ఇలా చాలా మంది కాల్‌ చేశారు. తర్వాత దానిని ఆపేశాను. ఇప్పుడు నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎలాంటి ఆఫర్లు రాలేదు.. ఇప్పుడు కూడా కొన్ని తప్పుడు కాల్స్‌ వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది.

నేను శృంగార నటిని కాదు
ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది నేనొక్కదాన్నే కాదు. చాలా మంది నటీమణులు చేస్తారు. కానీ నేను పోస్ట్‌ చేస్తే మాత్రం మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను ఎలాంటి శృంగార చిత్రాల్లో నటించలేదు, వీడియోలు చేయలేదు.  నాకిష్టమైన బట్టలు వేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తాను. కానీ కొందరు మాత్రం కమిట్మెంట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తారు. ఇంటర్నెట్‌లో వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని నటి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కిరణ్‌పై ఆరోపణలు
సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్‌ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్‌ వచ్చాయి. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్‌ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్‌ తన రెండు గ్లామరస్‌ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్‌ రియాక్ట్‌ అయ్యారు.

Advertisement
 
Advertisement