కిరణ్‌ అబ్బవరం 'క' సినిమా కలెక్షన్స్‌.. రెండురోజులకు ఎంతో తెలుసా..? | Kiran Abbavaram Ka Movie 2days Collection | Sakshi
Sakshi News home page

కిరణ్‌ అబ్బవరం 'క' సినిమా కలెక్షన్స్‌.. రెండురోజులకు ఎంతో తెలుసా..?

Nov 2 2024 12:40 PM | Updated on Nov 2 2024 1:12 PM

Kiran Abbavaram Ka Movie 2days Collection

కిరణ్‌ అబ్బవరం హీరోగా, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘క’.దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటిరోజు మంచి కలెక్షన్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా సత్తా చాటుతుంది. ఇక నవంబర్‌ 2,3 తేదీలు వీకెండ్‌ కాబట్టి భారీగా కలెక్షన్స్‌ రాబట్టొచ్చని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

'క' సినిమా మొదటిరోజు రూ. 6.18 కోట్లు రాబట్టి కిరణ్‌ అబ్బవరం కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్‌ టాక్‌ రావడంతో థియేటర్స్‌ అన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. కేవలం రెండురోజుల్లోనే రూ. 13.11 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. 'క' ఫైనల్‌ కలెక్షన్స్‌ సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సుజీత్‌–సందీప్‌ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి 'క' చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్‌ చేశారు. సినిమా ఇంతటి విజయం అందుకోవడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మొదట 18 ప్రీమియర్స్‌తో సినిమా స్టార్ట్‌ చేస్తే ఇప్పుడు 71 షోస్‌కు చేరుకుందని ఆయన అన్నారు. ఇందులో 56 షోస్‌ హౌస్‌ ఫుల్‌ అయినట్లు వంశీ చెప్పుకొచ్చారు. సినిమాలో కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement