‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ నుంచి కొత్త టీజర్‌ | Kingdom of the Planet of the Apes movie new teaser released | Sakshi
Sakshi News home page

‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ నుంచి కొత్త టీజర్‌

Mar 25 2024 1:06 AM | Updated on Mar 25 2024 11:26 AM

Kingdom of the Planet of the Apes movie new teaser released  - Sakshi

‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ పోస్టర్‌

ఓవెన్‌ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్‌ డురాండ్, పీటర్‌ మకాన్, విలియమ్‌ హెచ్‌. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’. వెస్‌ బాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

‘వెల్‌కమ్‌ టు మై కింగ్‌డమ్‌’, ‘బెండ్‌ ఫర్‌ యువర్‌ కింగ్‌’, ‘..నెవర్‌’ అనే డైలాగ్స్‌ ఈ టీజర్‌లో ఉన్నాయి. ‘ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ రీ బూట్‌ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్‌ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (2011)’, ‘డ్వాన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (2014), ‘వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement