వర్ధన్, కృష్ణప్రియ జంటగా వచ్చిన మూవీ కాగితం పడవలు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహించగా... ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫర్వాలేదనిపించింది.
తాజాగా ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో ఈ మూవీని మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీని గోదావరి నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
A love story rooted in real-life emotions. Watch it tomorrow only on SunNXT. #KaagithamPadavalu #TeluguMovies #LoveStory #NewOnOTT #SunNXT [Kagitham Padavalu, Kagitham Padavalu Telugu Movie, Telugu Cinema, Telugu Drama, Telugu Movie, Kagitham Padavalu Sun NXT, Sun NXT Telugu Movies]
— SUN NXT (@sunnxt) October 15, 2026


