ఖుష్బుపై విమర్శలు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్..! | Khushbu defends wedding post amid backlash after K Bhagyaraj death | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఖుష్బుపై విమర్శలు.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్..!

Jun 28 2026 12:12 PM | Updated on Jun 28 2026 12:27 PM

Khushbu defends wedding post amid backlash after K Bhagyaraj death

కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ స్టార్స్ సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఖుష్బు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పెళ్లి కూతురైన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆమె షేర్ చేసిన కొద్ది నిమిషాల్లో విమర్శలొచ్చాయి. వాటిపై ఖుష్బు సైతం తనదైన శైలిలోనే స్పందించింది. ఇంతకీ ఏంటా వివాదం? ఎందుకు విమర్శలొచ్చాయి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

అయితే ఈ శనివారం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మరణించారు. ఈ విషాద సమయంలో ఖుష్బు సుందర్ తన కుమార్తె పెళ్లి ఫోటోలు షేర్ చేయడంపై కొందరు విమర్శలు చేశారు. గోవాలో జరిగిన తమ కుమార్తె వివాహంలో భర్త సుందర్‌తో ఉన్న ఫ్యామిలీ ఫోటోపై ట్రోల్స్ చేశారు. డైరెక్టర్ భాగ్యరాజ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్న విషాద సమయంలో ఈ పోస్ట్ అవసరమా? అంటూ ఖుష్బును ప్రశ్నించారు.

దీనికి ఖుష్బు సైతం తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. మీరు నన్ను ఎందుకు అనుసరిస్తున్నారు?? కేవలం విమర్శించడానికేనా?? నా కూతురికి పెళ్లి జరిగి 48 గంటలు కూడా కాలేదు.  మీకు అంత కష్టంగా ఉంటే, నన్ను అనుసరించడం మానేయండి. మీలాంటి వాళ్లు లేకుంటేనే నేను బాగుంటా. నా లైఫ్‌లో సంతోషంగా ఉండే హక్కు నాకు ఉందంటూ అతనికి ఘాటూగానే బదులిచ్చారు.

భాగ్యరాజ్‌కు ఖుష్బు నివాళి..

అయితే తనపై విమర్శలు ఎదురైనప్పటికీ.. ఖుష్బు సుందర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భాగ్యరాజ్‌కు నివాళులర్పించారు. ఆయన ఫోటోను పంచుకుంటూ గుర్తు చేసుకన్నారు. మీరు ఇకపై విశ్రాంతి తీసుకోండి సర్. మీతో గడిపిన నా సరదా క్షణాలు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతాముంటూ పోస్ట్ చేశారు. కాగా.. భాగ్యరాజ్ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఐదు దశాబ్దాలకు కోలీవుడ్‌లో పనిచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement