ఆకట్టుకుంటున్న ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్‌లుక్‌ | Khel Khatam Darwajaa Bandh Movie First Look Released By Rana | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్‌లుక్‌

Oct 10 2024 4:55 PM | Updated on Oct 10 2024 7:17 PM

Khel Khatam Darwajaa Bandh Movie First Look Released By Rana

‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

"ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు."ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement