సోషల్‌ మెసేజ్‌తో ‘కావేరి’ | Kaveri Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

సోషల్‌ మెసేజ్‌తో ‘కావేరి’

Aug 20 2024 6:05 PM | Updated on Aug 20 2024 6:11 PM

Kaveri Movie Pre Release Event Highlights

రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కావేరి". రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ రిషిత మాట్లాడుతూ - పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు. మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది’ అన్నారు. ‘కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది’ అని సంగీత దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అన్నారు. ‘నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. కావేరి అందరికి నచ్చుతుంది’ అని హీరో ఫైజల్‌ అన్నారు.

‘ఇందులో కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిగ్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారు. రాజ్ కిరణ్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణ అవుతుంది. మంచి సోషల్ మెసేజ్ తో మేము చేసిన చిత్రమిది’ అని డైరెక్టర్‌ రాజేశ్‌ నెల్లూరు అన్నారు.

‘అబ్బాయిల ప్రవర్తన బాగుంటే అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాల్సిన చిత్రమిది’ అని నిర్మాత షేక్‌ అల్లాబకాషు అన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement