Vivek Agnihotri : అమితాబ్‌ ఇంటిపక్కనే..  ఖరీదైన ఇంటిని కొన్న డైరెక్టర్‌

The Kashmir Files Director Vivek Agnihotri Buys New Apartment In Mumbai - Sakshi

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. కమర్షియల్‌గానూ బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధించిందీ సినిమా. ఒక్క సినిమాతో డైరెక్టర్‌ ఇమేజ్‌ కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో ‍కాంట్రవర్సీ కామెంట్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్న వివేక్‌ అగ్నిహోత్రి తాజాగా ముంబైలో ఖరీధైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంధేరిలోని వెర్సీవాలోని 30వ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్‌ను సుమారు 17.92 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్లు బాలీవుడ్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక మరో విశేషం ఏమిటంటే.. అగ్నిహోత్రి కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్‌కి పై అంతస్తులోనే బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ కూడా ఓ ఇంటని కొనుగోలు చేశారు. కొన్నిరోజుల క్రితమే ఆయన దీన్ని కొన్నట్లు సమాచారం. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top