పొన్నియన్‌ సెల్వన్‌ ప్రచారం ముమ్మరం | Karthi First Look Release From Maniratnam Ponniyin Selvan Movie | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన పొన్నియన్‌ సెల్వన్‌ టీం

Jul 6 2022 12:17 PM | Updated on Jul 6 2022 12:17 PM

Karthi First Look Release From Maniratnam Ponniyin Selvan Movie - Sakshi

పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో హీరో కార్తి

పొన్నియన్‌ సెల్వన్‌ చిత్ర యూనిట్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెడ్రాస్‌ టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ఇది. నవలగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చరిత్ర ఇప్పుడు వెండితెరకెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష తదితర భారీ తారాణం నటిస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ భాగాన్ని సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొన్నియన్‌ సెల్వన్‌ టీం చిత్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ చిత్రంలోని ఒక్కో పాత్రను ఒక్కో రోజు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం విక్రమ్‌ పోషిస్తున్న ఆదిత్య కరికాలన్‌ పాత్రను విడుదల చేశారు. మంగళవారం కార్తీ పోషిస్తున్న వందియ దేవన్‌ పాత్రను విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూ చిత్రంపై ఆసక్తిని రేకెతిస్తోంది. తదుపరి జయం రవి పోషిస్తున్న అరుళ్‌మోళి వర్మన్, ఆ తరువాత కుందవై పాత్రలో నటిస్తున్న త్రిష పాత్రను, నందిని పాత్రలో నటిస్తున్న ఐశ్వర్యరాయ్‌ పాత్రను అంటూ ప్రధాన పాత్రలను వరుసగా విడుదల చేసి చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది మూవీ యూనిట్‌. కాగా వచ్చే వారం గానీ, ఆపై వారంగానీ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement