Kangana Ranaut Blames Movie Mafia for Horrible Media Made Perception - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: పనిగట్టుకుని తప్పుడు ప్రచారం.. మాఫియా అంటూ తీవ్ర ఆరోపణలు!!

Aug 8 2023 6:33 PM | Updated on Aug 8 2023 6:41 PM

Kangana Ranaut blames movie mafia for horrible media made perception - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చంద్రముఖి-2, ఎమర్జెన్సీ, తేజస్‌ చిత్రాల్లో నటిస్తోంది. అయితే బీ టౌన్‌లో ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న కంగనా విమర్శలతో వార్తల్లో నిలిచింది.  తన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.  దేవుడా అలాంటి వారి ఆత్మకు శాంతి కలిగించు వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. దీని వెనుక ఓ మాఫియా ముఠా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. 

(ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!)

తన సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా సినిమాల్లో రూ.150 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాలను ఫ్లాప్స్‌ అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించింది. ప్రతిరోజూ 10-15 కథనాలు నా చిత్రాలు ఫ్లాప్స్ అంటూ రాస్తున్నారు. ఇతరుల పట్ల ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తాయంటూ నిలదీస్తోంది. వీటి కోసం పగలు, రాత్రి ప్లాన్ చేసి.. ఇతరులను చెడుగా చూపించడానికి వారు స్వంత డబ్బును ఖర్చు చేస్తున్నారంటూ కంగనా తీవ్ర ఆరోపణలు చేసింది. 

గతంలో 2015లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, సన్నీ డియోల్ నటించిన చిత్రం ఐ లవ్ న్యూ ఇయర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.  ఈ చిత్ర తర్వాత కంగనా కెరీర్ ముగిసిపోయిందనే పెద్దఎత్తున వార్తలొచ్చాయి. అయితే కంగనా ఆ ఆరోపణలను ఖండించింది. తాజాగా సన్నీ డియోల్ నటించిన గదర్- 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు సన్నీ డియోల్‌కు నేను ఓ పెద్ద ఫ్యాన్‌ను అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తనపై గూఢచర్య చేస్తున్నారని ఆలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి:  నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్‌ రోషన్‌)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement