క‌మ‌ల్ హాస‌న్ గొప్ప మ‌న‌సు.. అంద‌రికీ విందు భోజ‌నం! | Kamal Haasan Hosts Grand Lunch To Tamil Bigg Boss 7 Team, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Kamal Haasan Bigg Boss Team Lunch: ఎంతైనా క‌మ‌ల్ గ్రేట్‌.. బిగ్‌బాస్ టీమ్‌, కంటెస్టెంట్ల‌కు స్పెష‌ల్ లంచ్‌

Published Tue, Jan 16 2024 9:15 AM

Kamal Haasan Hosts Lunch To Tamil Bigg Boss 7 Team - Sakshi

చాలామంది న‌టీన‌టులు వెండితెరే కావాలంటారు. బుల్లితెర తార‌లు కూడా ఎప్ప‌టికైనా వెండితెర మీద వాలిపోవాల‌ని, అక్క‌డే సెటిల్ కావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం వెండితెర‌, బుల్లితెర రెండింటికీ స‌మ ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటివారిలో నాగార్జున‌, క‌మ‌ల్ హాస‌న్‌, కిచ్చా సుదీప్, స‌ల్మాన్ ఖాన్‌.. ఇలా కొంద‌రు స్టార్ హీరోలున్నారు. వీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ షూటింగ్ షెడ్యూల్స్‌తో ఎంత‌ బిజీగా ఉన్నా స‌రే బిగ్‌బాస్ రియాలిటీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్నేళ్లుగా బిగ్‌బాస్ షోను న‌డిపిస్తున్నారు. అలా వీరు బుల్లితెర అభిమానుల‌కూ మ‌రింత‌ ద‌గ్గ‌ర‌య్యారు.

బిగ్‌బాస్ పూర్తి.. క‌మ‌ల్ లంచ్ ట్రీట్‌
జ‌న‌వ‌రి 14న‌ త‌మిళ బిగ్‌బాస్ ఏడో సీజ‌న్‌కు శుభం కార్డు ప‌డింది. ఈ షోలో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వీజే అర్చ‌న విజేత‌గా అవ‌త‌రించింది. ఇక‌పోతే ఈ సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అంద‌రికీ లంచ్ ఏర్పాటు చేశాడు క‌మ‌ల్‌. అలాగే బిగ్‌బాస్ టీమ్ మెంబ‌ర్స్‌కు సైతం విందు పార్టీ ఇచ్చాడు. సంక్రాంతి పండ‌గ‌పూట‌  అంద‌రికీ ర‌క‌రకాల వెరైటీల‌ను వ‌డ్డించి క‌డుపునిండా భోజ‌నం పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు.. ఎంతైనా క‌మ‌ల్ ఆలోచ‌న‌లే వేరు.. మీరు గ్రేట్ స‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏయే సినిమాలున్నాయ్‌?
సినిమాల విష‌యానికి వ‌స్తే క‌మల్‌ హాస‌న్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్దార్థ్‌, బాబీ సింహా, వివేక్ స‌హా త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో థ‌గ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో త్రిష‌, దుల్క‌ర్ స‌ల్మాన్, జ‌యం ర‌వి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో క‌మ‌ల్.. రంగ‌రాజ శ‌క్తివేల్ నాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హెచ్ వినోద్ డైరెక్ష‌న్‌లోనూ ఓ మూవీ చేయ‌నున్నాడు. స్టంట్ డైరెక్ట‌ర్ అన్‌బైర‌వ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రంలోనూ క‌మ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్నాడు.

చ‌ద‌వండి: గుంటూరు కారం టీమ్‌కు పార్టీ ఇచ్చిన మ‌హేశ్‌బాబు..

Advertisement
Advertisement