కొత్త చిత్రానికి సిద్ధమవుతున్న కమల్‌.. దర్శకులు ఎవరంటే..? | Kamal Haasan 237 Movie Project Details Out now | Sakshi
Sakshi News home page

కొత్త చిత్రానికి సిద్ధమవుతున్న కమల్‌.. దర్శకులు ఎవరంటే..?

Apr 14 2025 9:10 AM | Updated on Apr 14 2025 9:10 AM

Kamal Haasan 237 Movie Project Details Out now

చిత్ర జయాపజయాలతో పనిలేకుండా కథలో వైవిధ్యం ఉంటే అందుకు ఓకే చెప్పే నటుడు కమలహాసన్‌. కాగా ఇటీవల విక్రమ్‌ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన ఈయన నిర్మాతగాను అమరన్‌ చిత్రంతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థక్‌ లైఫ్‌ చేశారు. నటుడు శింబు ముఖ్యపాత్రను పోషించిన ఇందులో త్రిష నాయకిగా నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. థక్‌ లైఫ్‌ చిత్రం జూన్‌ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. 

నాయకన్‌ (నాయకుడు) తర్వాత మణిరత్నం, కమలహాసన్‌ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కాగా నటుడు కమలహాసన్‌ తాజాగా తన 237వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్‌ మాస్టర్ల ద్వయం అన్‌ అన్బరివ్‌ను దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. ఇది పూర్తిగా యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా ఉంటుందని సమాచారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమలహాసన్‌ ప్రత్యేకంగా అమెరికా వెళ్లి ఏఐ టెక్నాలజీని నేర్చుకోవడం మరొక విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ట్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

దీనిని కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కమలహాసన్‌ దర్శకుల ద్వయం అన్బరివ్‌తో కలిసి ఉన్న ఫోటోను తన ఎక్స్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు అందులో కేహెచ్‌ 237 అని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఈ నెలాఖరున పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీంతో ఈ సంచల చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం తరువాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement