అతిపెద్ద షాకింగ్ నిజం.. కాజల్ కొత్త సినిమా టీజర్ | Kajal The Indian Story Movie Teaser | Sakshi
Sakshi News home page

Kajal: ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం.. టీజర్ రిలీజ్

Jun 5 2026 2:07 PM | Updated on Jun 5 2026 2:27 PM

Kajal The Indian Story Movie Teaser

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేస్తున్న సినిమా 'ద ఇండియన్ స్టోరీ'. మన దేశంలో పురుగు మందుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయే అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో కాజల్.. న్యాయవాదిగా కనిపించనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)

అయితే సినిమాలోని విజువల్స్ ఏం చూపించకుండా కాన్సెప్ట్ ఏం ఉండబోతుందనే స్లైడ్స్ మాత్రమే వేశారు. 'మనం ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం', '50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల పురుగు మందులు వాడుతున్నాం', '20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు', 'ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్‌తో పోరాడుతోంది', 'ప్రతి నిమిషానికి ఒకరిద్దరు చనిపోతున్నారు', 'ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు', ఇదే 'ద ఇండియా స్టోరీ' అని చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: ఆసుపత్రి బెడ్‌పై నుంచే పండు మాస్టర్ వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement