ఓటీటీకి వచ్చేందుకు మరో సూపర్ హిట్ మూవీ సిద్ధమైంది. జయరామ్, ఊర్వశి నటించిన లేటేస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'పరిమళ అండ్ కో'. ఈ సినిమాకు పండిరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, అనంతిక సనీల్‌కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీ జూలై 10 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీలో మిస్కిన్, యోగి బాబు, శాండీ, సంతోశ్, శోభన్ కీలక పాత్రల్లో కనిపించారు.
అసలు కథేంటంటే..
ఈ చిత్రం ఒక హత్య మిస్టరీలో చిక్కుకున్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వారి చిన్న కుమార్తెను వేధిస్తున్న ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతాడు. ఈ వార్త బయటకు రాగానే.. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య ఉన్న వైరమేంటి? అనేది తెలియాలంటే పరిమళ అండ్ కో మూవీ చూడాల్సిందే. ఈ స్టోరీ వింటుంటే అచ్చం దృశ్యం మూవీనే తలపిస్తోంది.
#ParimalaAndCo (Tamil)
Streaming from July 10 Zee5 🍿!!#OTT_Trackers pic.twitter.com/Ib7l44ORqd— OTT Trackers (@OTT_Trackers) July 2, 2026


