వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు! | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: నికోలయ్‌తో నిశ్చితార్థం.. ఆ విషయం తెలిసి షాక్‌లో ఫ్యాన్స్‌!

Published Sun, Mar 3 2024 7:08 PM

Interesting Facts about Varalaxmi Sarathkumar Engaged with Nicholai Sachdev - Sakshi

ఇప్పుడు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ  నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను పెళ్లాడనుంది.

దీంతో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్‌ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్‌ సచ్‌దేవ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. 

వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్‌ సచ్‌దేవ్‌ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్‌, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్‌ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


  

Advertisement
 
Advertisement