56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ 2025) రెండో రోజు వేడుకల్లో భాగంగా ప్రపంచ సినీ రంగం, కొత్త తరం చిత్రకారుల ప్రతిభ, ఉన్నత స్థాయి దౌత్య చర్చలు, సాంస్కృతిక సంభాషణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మాస్టర్‌క్లాస్ సిరీస్, క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) 2025 ఆవిష్కరణ, అంబాసిడర్ల రౌండ్‌టేబుల్, ప్రత్యేక సంభాషణ కార్యక్రమాలు, స్టార్-స్టడ్డెడ్ రెడ్ కార్పెట్ వంటి ముఖ్య కార్యక్రమాలు ఇఫీ అంతర్జాతీయ ప్రతిష్ఠను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.
మాస్టర్‌క్లాస్ సిరీస్ ప్రారంభం
సమాచార,ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. ఎల్. మురుగన్ గోవాలోని కళా అకాడమీ లో ఇఫీ 2025 మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను ప్రారంభించారు. ముఖ్య అధికారులు, ప్రసిద్ధ చిత్రపరిశ్రమ వ్యక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈసారి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, కెనడా వంటి దేశాల ప్రతినిధులు ఈ విభాగంలో పాల్గొంటున్నారు.

సీఎంఓటి 2025 ప్రారంభం – 48 గంటల ఫిల్మ్‌మేకింగ్ చాలెంజ్
ఐదో ఎడిషన్ క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సి ఎం ఓ టి) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 125 మంది యువ చిత్ర రూప కర్తలు పాల్గొని 48 గంటల ఇంటెన్సివ్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్‌ను ఆసక్తి గా మార్చనున్నారు డా. మురుగన్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ సృజనాత్మకతకు కొత్త రూపాలు ఇస్తుందని పేర్కొన్నారు. ముంబైలో కొత్తగా ప్రారంభమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ వంటి కార్యక్రమాలు భారత క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేస్తాయన్నారు.

రెడ్ కార్పెట్ సెగ్మెంట్ – తారల సందడి
ఇఫీ రెడ్ కార్పెట్ సెగ్మెంట్ రెండో రోజూ ప్రేక్షకాదరణ పొందింది. ప్రపంచ, ఆసియా, భారత ప్రీమియర్‌లతో పాటు కమల్ హాసన్, శివ కార్తికేయన్, సాయి పల్లవి సహా ప్రముఖ సినీ తారల రాకతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. దర్శకులు, నటులతో ప్రేక్షకులను దగ్గర చేసే వేదికగా ఇది నిలిచింది.
అంబాసిడర్ల రౌండ్‌టేబుల్.. సహకారానికి కొత్త మార్గాలు
ఇఫీ 2025లో భాగంగా భాగస్వామ్య దేశాల రాయబారులతో అంబాసిడర్ల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.సహ-నిర్మాణాలు, టెక్నాలజీ భాగస్వామ్యం, నియంత్రణ సౌలభ్యాలపై విస్తృత చర్చలు జరిగాయి.
సమాచార & ప్రసార శాఖ కార్యదర్శి సoజయ్ జాజు మాట్లాడుతూ, భారత్ గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా ఎదుగుతోందని అన్నారు. డా. మురుగన్ మాట్లాడుతూ సహ-నిర్మాణం భవిష్యత్ ఆడియో-విజువల్ సహకారానికి కీలక బలం అవుతుందని పేర్కొన్నారు.

అదే విధంగా, విఎ ఫ్ ఎక్స్, యానిమేషన్, పైరసీ నిరోధక చర్యలు, మంత్రిత్వ శాఖ సమన్వయంతో 2025 నాటికి భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం 31.6 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని వివరించారు.
ఆకట్టుకున్న ముజాఫర్ అలీ, షాద్ అలీ ప్రత్యేక సంభాషణ
ప్రముఖ సినీ దర్శకులు ముజాఫర్ అలీ, షాద్ అలీల మధ్య జరిగిన ప్రత్యేక ఇన్ కన్సర్వేషన్ సెషన్ ప్రేక్షకులను అలరించింది. రవి కొట్టరకరా సన్మానం అనంతరం జరిగిన ఈ సంభాషణలో భారతీయ సినిమా తరతరాల మార్పు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, కళాత్మక పరిణామంపై విశేష చర్చ సాగింది


