లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన స్టార్‌ హీరో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే? | Hrithik Roshan and Rakesh Roshan Sell 3 Houses In Mumbais Andheri | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: ఖరీదైన ఫ్లాట్లను అమ్మేసిన హృతిక్ రోషన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Jun 13 2025 4:43 PM | Updated on Jun 13 2025 5:53 PM

Hrithik Roshan and Rakesh Roshan Sell 3 Houses In Mumbais Andheri

బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్‌ ప్రస్తుతం వార్‌-2  మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్‌ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్‌ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్‌లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌వి కాగా.. మూడో ఫ్లాట్‌ హృతిక్ రోషన్‌కు చెందినదిగా సమాచారం.

మరోవైపు హృతిక్ రోషన్‌ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రాకేశ్‌ రోషన్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకు  హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement