హనీరోజ్‌ 'రాహేలు' టీజర్‌ విడుదల | Honey Rose Rachel Official Teaser Out Now | Sakshi
Sakshi News home page

హనీరోజ్‌ 'రాహేలు' టీజర్‌ విడుదల

Published Mon, Jun 17 2024 6:01 PM | Last Updated on Tue, Jun 18 2024 1:29 PM

 Honey Rose Rachel Official Teaser Out Now

మలయాళ భామ హనీరోజ్‌ చాలారోజుల తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించనుంది. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అయితే, చాలా రోజుల తర్వాత  'రాహేలు' అనే పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది.

ఆనందిని బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  అందం, అభినయంతో కుర్రకారుల హృదయాల్ని కొల్లగొట్టిన హనీరోజ్‌ వెండితెరకు దూరమైనప్పటికీ సోషల్‌ మీడియాతో తన అభిమానులకు దగ్గరగానే ఉంది. గ్లామర్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ నెట్టింట హీట్‌ను పెంచుతుంది. సినిమాలు లేకున్నా ఆమె పేరు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. 

ఇప్పుడు 'రాహేలు' సినిమాతో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్‌లో గ్లామర్‌తో పాటు కత్తి పట్టుకుని ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళం,హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement