breaking news
RACHEL
-
'వేర్ ఈజ్ మై హజ్బెండ్?' సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు!
పాటతో మనసును తాకడం ఒక ఎత్తు.. అదే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం మరో ఎత్తు! ఇప్పుడు ఈ రెండింటినీ సాధించి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ప్రముఖ పాప్ సింగర్ రాచల్ అగాథా కీన్ (రేయ్). తన రెండో ఆల్బమ్ ‘దిస్ మ్యూజిక్ మే కంటెయిన్ హోప్’తో 2026 మెర్క్యురీ ప్రైజ్‌ను గెలుచుకుంది. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి పాప్ ఆల్బమ్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఆమెకు 25 వేల పౌండ్ల నగదు బహుమతి కూడా దక్కింది.హాలీవుడ్ స్వర్ణయుగపు వైభవాన్ని గుర్తు చేసే సంగీతం.. భావోద్వేగాలతో సాగే కథనం ఈ ఆల్బమ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 17 పాటలు.. 73 నిమిషాల నిడివితో రూపొందిన ఈ ఆల్బమ్‌లో ప్రేమ, విరహం, బాధను అధిగమించి మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అలాగే, ఇందులోని ‘వేర్ ఈజ్ మై హజ్బెండ్?’ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు ఆర్కెస్ట్రాలు, 100 మందికి పైగా సంగీత కళాకారులు ఈ ఆల్బమ్ కోసం పనిచేయడం మరో విశేషం.అయితే, ఈ విజయానికి ముందు తాను ఎన్నో ఇబ్బందులు దాటాల్సి వచ్చిందని చెప్పింది. రెండేళ్ల క్రితం 'నా కారు దొంగతనానికి గురైంది. అందులో పాటలు రాసుకునే నోట్బుక్లు, డెమో రికార్డింగ్‌లు కూడా ఉండటంతో ఆల్బమ్ పనులు దాదాపు ఏడాది ఆలస్యమయ్యాయి. ఆ సమయంలో నేను తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ.. ఆ అనుభవాలే నా ప్రయాణంలో భాగమని ఇప్పుడు భావిస్తున్నాను. వాణిజ్య విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా, మనసుకు నచ్చినట్లు పాటలను రూపొందించానని' రేయ్ తన ఆనందాన్ని పంచుకుంది.మార్చిలో విడుదలైన ఈ ఆల్బమ్ బ్రిటన్ మ్యూజిక్ చార్టుల్లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సర్ పాల్ మెక్కార్ట్నీ, ఒలివియా డీన్, జేడ్ వంటి ప్రముఖుల ఆల్బమ్‌లతో పోటీపడి మెర్క్యురీ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే, 1992 నుంచి అందిస్తున్న ఈ అవార్డు.. బ్రిటన్, ఐర్లాండ్ సంగీత కళాకారుల ఉత్తమ ఆల్బమ్‌లకు గుర్తింపుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఒలివియా డీన్, కొజీ రాడికల్, నాట్స్, జేడ్ వంటి కళాకారులు కూడా పోటీలో నిలిచారు.రేయ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. 'నా కష్టానికి దక్కిన గుర్తింపుగా ఈ విజయాన్ని భావిస్తున్నాను. అలాగే, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన, ఊహించని మలుపు మన ప్రయాణాన్ని కొత్త దిశగా నడిపిస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఒకప్పుడు కన్నీళ్లు తెప్పించిన అనుభవాలనే నేడు అద్భుతమైన సంగీతంగా మలిచి.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన రేయ్ ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమనే చెప్పవచ్చు.ఇదీ చదవండి: థర్మాకోల్ బాక్స్‌తో ఏసీ..! ఆ స్టూడెంట్ ఆవిష్కరణకు హర్ష్ గోయెంకా ఫిదా! -
Rachel Gupta: అందాల రాణికి బిగ్ షాక్
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయిపంజాబ్ జలంధర్‌కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు -
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
మలయాళ భామ హనీరోజ్ చాలారోజుల తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించనుంది. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. అయితే, చాలా రోజుల తర్వాత 'రాహేలు' అనే పాన్ ఇండియా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.ఆనందిని బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అందం, అభినయంతో కుర్రకారుల హృదయాల్ని కొల్లగొట్టిన హనీరోజ్ వెండితెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాతో తన అభిమానులకు దగ్గరగానే ఉంది. గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్‌ను పెంచుతుంది. సినిమాలు లేకున్నా ఆమె పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు 'రాహేలు' సినిమాతో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్లో గ్లామర్‌తో పాటు కత్తి పట్టుకుని ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
యంగ్ హీరోతో హనీరోజ్ రొమాన్స్.. వైరల్ అవుతున్న న్యూస్
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్ యూత్ గుండెళ్లో గ్లామర్ ముద్ర వేశారు. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ తన సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా అవన్నీ అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేసింది. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘రాచెల్’లో హనీరోజ్‌నే ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్) తాజాగా ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఈ హాట్ బ్యూటీ జతకడితే సినిమాకు భారీ ప్రమోషన్ దక్కడం ఖాయం అని తెలుస్తోంది. పాటలో తన హాట్ హాట్ ఫిజిక్‌తో దుమ్ములేపడం గ్యారెంటీ అని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ పాట కోసం ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ విషయాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్ అధికారికంగా తెలపాల్సి ఉంది. -
గ్లామర్‌తో మతిపోగొడుతోన్న బ్యూటీ.. సినిమా బ్యాన్ చేయాలంటూ..
మొదట్లో బాలయ్య 'వీరసింహారెడ్డి' హీరోయిన్ హనీరోజ్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాత టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని తాజాగా కుర్రాళ్ల గుండెళ్లో చెరగని ముద్రే వేసింది. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పడు పాన్ ఇండియా మూవీ ‘రాహేలు'లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తుంది. (ఇదీ చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్) ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో హనీరోజ్ భయపెడుతూనే.. కుర్రకారుకి కావాల్సిన హాట్ ఫోజులతో రెచ్చగొడుతుంది. 'రాహేలు' ఫస్ట్ లుక్‌లో హనీరోజ్ కత్తి పట్టుకుని బీఫ్ మాంసం కొడుతోంది. విజువల్స్‌లో ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. అక్కడ సీరియస్ లుక్‌లో కత్తిపట్టుకొని హనీరోజ్ ఆకర్షిస్తూ.. గ్లామరస్ యాంగిల్‌ని తెలియజేస్తోంది. ఆమె బీఫ్ అమ్మే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో సినిమా రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో పైట లేకుండా హనీ రోజ్ కనిపించిన తీరు కంటే.. బీఫ్ మీదే నెటిజన్ల దృష్టి పడింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి చిత్రయూనిట్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta)


