సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం ‘హిట్ అండ్ రన్’. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో హీరోయిన్ నటాషా సింగ్ రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


