క్రైమ్‌... థ్రిల్‌ | Hide N Seek Movie First Look launch | Sakshi
Sakshi News home page

క్రైమ్‌... థ్రిల్‌

Aug 11 2024 12:25 AM | Updated on Aug 11 2024 12:25 AM

Hide N Seek Movie First Look launch

విశ్వంత్, శిల్పా మంజునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘హైడ్‌ న్‌ సిక్‌’. బసిరెడ్డి రానా దర్శకత్వంలో నిశాంత్, ఎంఎన్‌ఓపీ సమర్పణలో సహస్ర ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన నటుడు శివాజీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ ఎక్కువగా వస్తోంది.

ఇది మంచి పరిణామం. ‘హైడ్‌ న్‌ సిక్‌’ సినిమాకు ప్రేక్షకులు విజయం చేకూర్చాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు విశ్వంత్‌. ‘‘ఎన్ని కష్టాలొచ్చినా ఈ సినిమాను ఆపేది లేదని నిర్మాత భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని పేర్కొన్నారు బసిరెడ్డి రానా.  దర్శకులు మల్లి అంకం, ఆదిత్యా హాసన్, నవీన్‌ మేడారం అతిథులుగా హాజరై, ‘హైడ్‌ న్‌ సిక్‌’ విజయాన్ని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement