‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ అం అః’ పోస్ట‌ర్ విడుద‌ల | Hero Srikanth Launch AAM AHA Movie First Look | Sakshi
Sakshi News home page

‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ అం అః’ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన హీరో శ్రీకాంత్‌

Aug 31 2021 7:19 PM | Updated on Aug 31 2021 7:19 PM

Hero Srikanth Launch AAM AHA Movie First Look - Sakshi

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌. శ్యామ్ మండ‌ల ద‌ర్శ‌కుడు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను హీరో శ్రీకాంత్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్‌తో పాటు నిర్మాత శ్రీనివాస్‌, ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల‌, హీరో సుధాక‌ర్ జంగం, సినిమాటోగ్రాఫ‌ర్ శివారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘అం అః’ మూవీ టైటిల్ చాలా బాగుంది. ఇది వ‌ర‌కు నేను కూడా అఆఇఈ అనే టైటిల్‌తో సినిమా చేశాను. ఇప్పుడు ‘అం అః’ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌, నిర్మాత శ్రీనివాస్‌గారు, హీరో సుధాక‌ర్ ఓ టీమ్‌గా ఏర్ప‌డి మంచి కంటెంట్‌తో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌’ అన్నారు.  నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు  మాట్లాడుతూ ‘‘మా మూవీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన శ్రీకాంత్‌గారికి థాంక్స్‌. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌గారు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశారు. శివ‌గారు త‌న‌ సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను రిచ్‌గా ఎలివేట్ చేశారు. అలాగే సినిమా బాగా రావ‌డానికి స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు శ్యామ్  మండ‌ల మాట్లాడుతూ ‘మా మూవీ ‘అం అః’  పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన శ్రీకాంత్‌ గారికి థాంక్స్‌. క‌రోనా ప‌రిస్థితుల్లోనూ నిర్మాత శ్రీనివాస్‌ గారు ఇచ్చిన స‌పోర్ట్‌తో ‘అం అః’ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాను. అంతకు ముందు ఆయ‌నిచ్చిన స‌పోర్ట్‌తోనే ట్రూ అనే సినిమాను కూడా పూర్తి చేశాను. నాపై న‌మ్మ‌కంతో శ్రీనివాస్‌ గారు ‘అం అః’ సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బెస్ట్ అందించారు.  హీరో సుధాక‌ర్ కంటెంట్‌ను న‌మ్మి వ‌ర్క్ షాప్ చేసి చ‌క్క‌టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ టీమ్‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement