Hero Ravi Teja To Enter Into Bollywood Industry - Sakshi
Sakshi News home page

Ravi Teja : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న మాస్‌ మహారాజ రవితేజ

Apr 8 2023 3:23 PM | Updated on Apr 8 2023 3:44 PM

Hero Ravi Teja To Enter Into Bollywood Industry - Sakshi

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్‌ బాట పడుతున్నారు. సౌత్‌ సినిమాలు పాన్‌ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్‌ మేకర్స్‌ దృష్టి ఇప్పుడు సౌత్‌ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్‌ స్టార్స్‌ ఉండేలా మేకింగ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’లో వెంకటేశ్, వార్‌-2లో హృతిక్‌ రోషన్‌తో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో మాస్‌ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది.

బీటౌన్‌ టాక్‌ ప్రకారం.. యంగ్‌ హీరో వరుణ్‌ ధావణ్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్‌ జోహార్‌, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ రానుందట.

Advertisement
 
Advertisement
Advertisement