Jeans Movie Actor Prashanth Is Getting Married For Second Time, Deets Inside - Sakshi
Sakshi News home page

Prashanth Second Marriage: రెండో పెళ్లి చేసుకోబోతున్న 'జీన్స్‌' హీరో.. అమ్మాయి ఎవరంటే..

Mar 22 2022 10:32 AM | Updated on Mar 22 2022 11:39 AM

Hero Prashanth Getting Married For Second Time - Sakshi

నిర్మాత త్యాగరాజన్‌ కొడుకుగా ఇండస్ట్రీలో ఇంట్రీ ఇచ్చి తనకుంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రశాంత్‌. జీన్స్‌, దొంగ దొంగ, జోడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్‌ రామ్‌చరణ్‌ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్‌సంపాదించుకున్న ప్రశాంత్‌ ప్రస్తుతం అంధాదూన్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు.

అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. త్వరలోనే ప్రశాంత్‌ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. కాగా 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్‌ పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.

మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్‌ తాజాగా వారి కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లాడనున్నాడట. త్వరలోనే ఈ వార్తలపై మరింత క్లారిటీ రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement