నయన్‌- విఘ్నేశ్‌లను కలిపిన స్టార్‌ హీరో ఎవరంటే? | Nayanthara And Vignesh Shivan Reveal Who Played The Role Of A Cupid For Them - Sakshi
Sakshi News home page

Nayanthara: నయన్‌- విఘ్నేశ్‌లను ఒక్కటి చేసిన హీరో ఎవరో తెలుసా?

Apr 6 2024 6:44 PM | Updated on Apr 6 2024 7:41 PM

This Hero Played Cupid for Nayanthara and Vignesh Shivan - Sakshi

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్‌ కపుల్‌. నయనతార హీరోయిన్‌గా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ (2015) సినిమాకు విఘ్నేశ్‌ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్‌ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్‌, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు.

ఇకపోతే వీరి మధ్య లవ్‌ పుట్టడానికి ఓ స్టార్‌ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్‌ రౌడీ ధాన్‌ కథ నయనతారకు చెప్పమని ధనుష్‌ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్‌ నచ్చలేదన్న విజయ్‌ సేతుపతి నయన్‌ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్‌ రౌడీ ధాన్‌ మూవీకి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement