సీఎం జగన్‌ను కలిసిన నటుడు మంచు మనోజ్‌

Hero Manchu Manoj Meet CM YS Jagan Mohan Reddy Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సినీ హీరో మంచు మనోజ్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

''సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను.  మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు '' అని ట్వీట్‌ చేశారు.

చదవండి: Manchu Vishnu: వారిని సస్మానించిన మంచు విష్ణు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top