షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్‌ రివీల్‌ చేసిన అశ్విన్‌ బాబు | Hero Ashwin babu In Tollywood Movie Title Launch Event | Sakshi
Sakshi News home page

Title Launch: ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి: టైటిల్‌ లాంఛ్‍లో అశ్విన్‌ బాబు

Jul 28 2024 7:30 PM | Updated on Jul 28 2024 7:30 PM

Hero Ashwin babu In Tollywood Movie Title Launch Event

షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు  హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు.  

సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement