
మొన్నటివరకు తెలుగు సినిమాలకు సంగీతం అంటే అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదంటే తమన్ గుర్తొచ్చేవారు. వీళ్ల కాదంటే తమిళం నుంచి అనిరుధ్‌ని తీసుకొచ్చేవారు. స్టార్ హీరోల మూవీస్ అంటే దాదాపు వీళ్లే మెయిన్‌గా కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్లతో పాటు కొందరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ బయటకొస్తున్నారు. అలా వచ్చిన వాళ్లలో హర్షవర్షన్ రామేశ్వర్ ఒకడు.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!)
'అర్జున్ రెడ్డి'కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి కెరీర్ మొదలుపెట్టిన హర్షవర్ధన్.. తర్వాత తెలుగు, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా తీసిన మూడు సినిమాలకు ఇతడే సంగీతమందించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. రీసెంట్‌గానే 'యానిమల్' చిత్రానికిగానూ జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు. రీసెంట్ టైంలో అయితే ఇతడి నుంచి పెద్ద చిత్రాలేం రాలేదు.
కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి చిత్రానికి హర్షవర్థన్ సంగీతమందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూరీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై హైప్ బాగానే ఉంది. హర్షవర్ధన్ మ్యూజిక్ బాగుంటే మాత్రం ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. అలానే రీసెంట్‌గా షూటింగ్ మొదలైన త్రివిక్రమ్-వెంకటేశ్ లేటెస్ట్ మూవీకి కూడా ఇతడే సంగీతమందిస్తున్నాడట. ప్రస్తుతానికైతే ఇది రూమర్ మాత్రమే. త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో. త్రివిక్రమ్ తీసిన గత చిత్రాలకు తమన్ సంగీతమందించాడు. ఈసారి మాత్రం లైన్‌లోకి హర్షవర్ధన్ వచ్చినట్లున్నాడు.
(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)
