హనుమాన్‌ జంక్షన్‌లో... | Hanuman Junction will re-release in theatres on June 28th | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జంక్షన్‌లో...

Jun 17 2025 12:31 AM | Updated on Jun 17 2025 12:31 AM

Hanuman Junction will re-release in theatres on June 28th

అర్జున్, జగపతి బాబు, వేణు తొట్టెంపూడి, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనుమాన్‌ జంక్షన్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. ఎడిటర్‌ మోహన్‌ సమర్పణలో ఎం.ఎల్‌. మూవీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎంవీ లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2001 డిసెంబరు 21న విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని ఈ నెల 28న రీ రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘‘యాక్షన్ , అద్భుతమైన హ్యూమర్‌ మేళవించిన సినిమా ‘హనుమాన్‌ జంక్షన్‌’.  ఎంగేజింగ్‌ స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు కల్ట్‌ స్టేటస్‌ను తీసుకువచ్చాయి. అలాంటి ఎవర్‌ గ్రీన్‌ ఎంటర్‌టైనర్‌ మరోసారి ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సి. రామ్‌ప్రసాద్, సంగీతం: సురేశ్‌ పీటర్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement